ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొనసాగుతున్న ప్రొడక్షన్ వెంచర్లలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆర్సీ 15’, ‘తలపతి 66’ వంటి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల గురించి తాజాగా దిల్ రాజు అప్డేట్స్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌ల మూవీ ‘ఆర్సీ 15’. ఈ సినిమాపై మెగా అభిమానులకు బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2023 సంక్రాంతి సీజన్‌లో థియేటర్ లలో విడుదల కానుందని దిల్ రాజు ధృవీకరించారు. సినిమా షూటింగ్ అనుకున్నట్లుగానే జరుగుతోందని చెప్పారు.
Read Also : ‘డీజే టిల్లు’ మనసులో ‘పటాస్ పిల్లా’ టెంట్… రొమాంటిక్ సాంగ్
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న “తలపతి 66” గురించి దిల్ రాజు మాట్లాడుతూ “విజయ్ గారికి తలపతి 66 స్క్రిప్ట్ బాగా నచ్చింది. గత 20 ఏళ్లలో తాను విన్న అత్యుత్తమ స్క్రిప్ట్ ఇదేనని అన్నారు. ఈ మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభించి దీపావళి సీజన్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం అని అన్నారు. ఈ రెండు పెద్ద చిత్రాలతో ఎస్విసి క్రియేషన్స్ ను మరింతగా విస్తరించాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
