Site icon NTV Telugu

Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..

Dilraju

Dilraju

Dilraju : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొత్త ఏఐ స్టూడియోను లాంచ్ చేశారు. టాలీవుడ్ లో ఫస్ట్ ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. తాజాగా స్టూడియో ప్రారంభ వేడుక నిర్వహించగా.. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. Lord Venkateshwara లో ముందు పేర్లతో LorVen అని ఏఐ స్టూడియోకు పేరు పెట్టారు. ఈ వేడుకకు డైరెక్టర్లు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, వి.వి.వినాయక్ లాంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏఐ స్టూడియో పెడుదామనే ఆలోచన వచ్చిందన్నారు.
Read Also : Vallabhaneni Vamsi: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

‘ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. సినిమా రంగంలో దీని అవసరం చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పనులు చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకే క్వాంటమ్ ఏఐ కంపెనీతో చర్చలు జరిపిన తర్వాత దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇన్ని రోజులు దీని గురించి చాలా రీసెర్చ్ చేశాం. ఒక సినిమా కథ పూర్తి అయితే ఏఐ సాయంతో మనం సినిమాను కూడా చూసేయవచ్చు. అదే మా పెద్ద టార్గెట్. దాని వల్ల ఆ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Read Also : Rakul Preet : బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్..

Exit mobile version