Site icon NTV Telugu

భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

Akhanda

నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘అఖండ’ సినిమా నైజాం హక్కులను దక్కించుకోవడానికి దిల్ రాజు 19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?

బ్లాక్ బస్టర్ మూవీస్ లెజెండ్, సింహా తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న మూడో తెలుగు సినిమా ‘అఖండ’. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో సాధారణ వ్యక్తిగా కన్పించబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది.

Exit mobile version