NTV Telugu Site icon

Dil Raju: పొలిటికల్ ఎంట్రీ.. దిల్ రాజు ఏమన్నాడంటే..?

Dil Raju

Dil Raju

Dil Raju: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా, డిస్ట్రబ్యూటర్ గా దిల్ రాజు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. ఎన్ని ప్రశంసలు అందుకుంటున్నాడో.. అన్నే విమర్శలు అందుకుంటున్నాడు హార్ట్ కింగ్. తన సినిమా కోసం మిగతా హీరోల సినిమాలకు థియేటర్లు తక్కువ ఇస్తాడని పేరు కూడా ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో దిల్ రాజు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. హిట్, ప్లాప్ పక్కన పెడితే.. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే తాపత్రయపడతాడు. ఈ మధ్యనే బలగం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. చిన్న సినిమా, ఒక కొత్త దర్శకుడు.. ఎమోషనల్ కథ.. సినిమా హిట్ అవుతుందా..? లేదా..? అనేది ఆలోచించకుండా.. ఇలాంటి కథ ప్రేక్షకులకు చేరాలని దిల్ రాజు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో దిల్ రాజు తన పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చాడు.

Niharika Konidela: వాటిని తింటూ మెగా డాటర్ ఫోజులు.. ఏమన్నా విశేషమా..?

గత కొన్నిరోజులుగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఉందనున్నదని, రేవంత్ రెడ్డి, దిల్ రాజునూ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. దిల్ రాజు తన సొంత వ్యయంతో నిర్మించిన స్వామివారి ఆలయంలో రేవంత్ రెడ్డి తో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ వార్తలకు బలం చేకూరిందని వార్తలు వచ్చాయి. ఇంకోపక్క బలగం సినిమాను కేసీఆర్, కేటీఆర్ లాంటివారు కూడా మెచ్చుకొని దిల్ రాజు జును ప్రశంసించడంతో ఈ పార్టీ కూడా దిల్ రాజును కోరుతుందని కూడా రాసుకొచ్చారు. ఇక తాజాగా వీటికి దిల్ రాజు చెక్ పెట్టాడు. తన రాజకీయ రంగప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చాడు. ” సినిమా ఇండస్ట్రీలో నన్ను ఒక మాట అంటేనే తట్టుకోలేను. అలాంటిది రాజకీయాలు అంటే ఎలా ఉంటుందో ఎవరికి చెప్పనవసరం లేదు. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వస్తానో లేదో ఇప్పుడు అయితే అప్రస్తుతం” అని చెప్పుకొచ్చాడు. అంటే నిర్మొహమాటంగా నాకు రాజకీయాలు పడవు అని చెప్పేశాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పొచ్చు. మరి ముందు ముందు హార్ట్ కింగ్ హార్ట్ ఏమైనా మారి రాజకీయాల్లోకి వస్తాడేమో చూడాలి.

Show comments