Dil Raju: టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఫైర్ అయ్యారు. కార్తికేయ 2 సినిమాను తొక్కేస్తున్నారు అంటూ దిల్ రాజు పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెల్సిందే. కావాలనే దిల్ రాజు ఇదంతా చేస్తున్నాడని, ఆయన సినిమా కోసం వేరే సినిమాలను తొక్కేస్తున్నాడని వార్తలు వస్తున్నా వేళ నేడు కార్తికేయ సక్సెస్ మీట్ లో ఫైర్ అయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ” సినిమా అంటే మాకు ప్రాణం. ఒక సినిమా హిట్ అయితే మేము ఎంతో సంతోషిస్తాం. అలాంటిది సినిమాను తొక్కేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. అందులో నిజం లేదు.
దిల్ రాజు పేరు కనిపిస్తే ఎవరు చూడడంలేదు.. వారిపై ట్రోల్స్ వేయాలి.. మీ క్లిక్స్ కోసం ఎవరో ఒకరిపై నిందలు వేయాలి.. నిజం ఏంటి..? అందులో ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోకుండా ఎవడికి తోచింది వారు రాసుకొస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని రాయండి.. నిజంగా నేను తప్పు చేస్తే రెడీ గా ఉంటాను.. నా తప్పును మీడియా ముందు క్షమించమని అడగడానికి, సినిమా అంటే మాకు ప్రాణం.. వాస్తవాలను తెలుసుకొని రాయండి.. తెలియకుంటే మూసుకోండి” అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
