NTV Telugu Site icon

Asish Reddy Marriage: ఆశిష్ రెడ్డి పెళ్ళి… సీఎంకి ఆహ్వానం పలికిన దిల్ రాజు ఫ్యామిలీ

Dil Raju Family Invites Cm Revanth Reddy

Dil Raju Family Invites Cm Revanth Reddy

Dil Raju Family invites CM Revanth Reddy to Asish Reddy Marriage: ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే మూవీ ఒకటి చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన గురించి చెప్పాలంటే హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా అశిష్‌ రెడ్డి త్వరలో ఒక ఇంటి వాడు అవబోతున్నాడు. అదేనండీ ఆశిష్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. జైపూర్‪‌లో వీరి వివాహ వేడుక జరగనుంది.

Eagle: చివరి 40 నిమిషాలు ఇప్పటి వరకు చూడనంత కొత్తగా.. ‘ఈగల్‌’ నిర్మాత కామెంట్స్

ఈ క్రమంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక అదే విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని కూడా నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఇక ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments