Site icon NTV Telugu

రాఘవేంద్రరావు ‘శతమానంభవతి’ కి ఎందుకు నో చెప్పారు!?

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘ పెళ్లి సందడి’ సినిమాతో నటుడుగా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్, శ్రీ లీల ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 15 వ తేదీన విడుదల కానుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ‘శతమానంభవతి’తోనే రాఘవేంద్రరావును పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేయాలనుకున్నామని, అయితే అది వర్కవుట్ కాలేదన్నారు. తిరుపతిలో స్క్రిప్ట్ కూడా చెప్పామని ఎందుకో మా ఆఫర్‌ని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ పాత్రను ప్రకాష్ రాజ్ తో చేయించాం అని చెప్పాడు దిల్ రాజు.దిల్ రాజు మాటలకు రాఘవేంద్రరావు కూడా స్పందించాడు. తనకు వెంకటేష్ కూడా 10 సంవత్సరాల క్రితం ఓ పాత్ర ఆఫర్ చేశారు. ఆ తర్వాత ‘శతమానం భవతి’లో పాత్ర చేయాలని పట్టుబట్టినా తిరస్కరించాను. అందుకే ఈ సినిమా నిర్మాణంలో సహకారం అడిగాను. అది జరగలేదు. దాంతో నా పాత్ర పరిచయాన్ని మీరు విడుదల చేసేలా ప్లాన్ చేసాను అన్నారు.

Exit mobile version