NTV Telugu Site icon

Dil Raju: ‘గుంటూరు కారం’కి నెగిటివ్ టాక్.. దిల్ రాజు ఏమన్నారంటే?

Guntur Kaaram Dil Raju Comments

Guntur Kaaram Dil Raju Comments

Dil Raju Comments at Guntur Kaaram Success Meet : మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేసిన ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త మిక్స్ రివ్యూస్ వచ్చాయి. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే చాలా మంది పర్వాలేదు, యావరేజ్, అంటే ఒకరిద్దరు బావుందన్నారు. కానీ నేను సినిమా చూసినప్పుడు పర్సనల్ ఏదైతే ఫీలయ్యానో మళ్లీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న సుదర్శన్ థియేటర్ కి వెళ్లాను. రెండోసారి కూడా చూశాను. అయితే ఇది మహేష్ బాబు క్యారెక్టర్ ని బేస్ చేసుకుని తల్లి కొడుకుల ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ మీద చేసిన సినిమా. ఈ బాగాలేదు బాగాలేదు బాగాలేదు అని నెగిటివ్ కామెంట్స్ విని సినిమాకి వెళ్లిన వాళ్లు కూడా సినిమాలో విషయం కనెక్ట్ అయిన తర్వాత ఇదేంటి ఇంత బాగుంటే బాగోలేదు అంటున్నారు అంటూ బయటికి వస్తున్నారని అన్నారు. ఇలా మొదటి నెగటివ్ ఆగు వచ్చి తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ లైన ఎన్నో సినిమాలు చూశాం. గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతికి ఫ్యామిలీస్ తో కలిసి హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. నేను సుదర్శన్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను.

Dil Raju : హనుమాన్ చిన్న సినిమా అన్న దిల్ రాజు.. తేజ రియాక్షన్ ఇదే!

ఆడియన్స్ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కి మహేష్ బాబు క్యారెక్టర్ కి, మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ మాస్ సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ కానీ అంతా పాజిటివ్ గానే ఉంది. కచ్చితంగా పండుగకి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ మిక్స్డ్ టాక్స్ నెగిటివ్ టాక్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఈ పండుగ పూర్తి అయిన తర్వాత మొత్తం ఎంత కలెక్ట్ చేసింది ? గత మహేష్ బాబు సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి అని లెక్క వేసిన తర్వాతే ఇప్పటివరకు మాట్లాడిన విషయం మీద కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగు రోజుల పండుగ పూర్తయ్యే వరకు మేము ఎవరి మీద కామెంట్ చేసేది లేదు, చెప్పేది లేదు. సినిమా బాగుంటే చూస్తారు లేకుంటే లేదు. బాగుండే సినిమాని ఎవరు ఆపగలిగేది లేదు, అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతికి రాగానే మా అందరి మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. అల్టిమేట్ గా ఇది వ్యాపారం ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి వ్యాపార పరంగా చేస్తారు, రెవెన్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే విషయం మీద ఇక్కడ అంతా నడుస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. మరో రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరూ మాట్లాడరు. మళ్లీ 16 , 17 తారీఖులు తర్వాత ప్రతివారం వచ్చే సినిమాలు గురించి మేమైనా మీరైనా ఫోకస్ చేస్తాం అని అంటూ ముగించారు.