NTV Telugu Site icon

Ram Charan: నేను తండ్రి కాబోతున్న విషయం అందరికన్నా ముందు అతనికే చెప్పాను

Tarak

Tarak

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు న్యూయార్క్ లో మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ షో లో పాల్గొన్న ఏకైక భారతీయ హీరోగా పేరు అందుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఈ ఇంటర్వ్యూలో చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా తాను తండ్రి కాబోతున్న విషయం తెలిసాక తను పడిన సంతోషాన్ని ఇంటర్నేషనల్ వేదికపై తెలిపాడు చరణ్. పదేళ్ల తరువాత ఉపాసన తల్లి కాబోతుంది.. ఈ విషయం తెలిసాకా మీరెలా ఫీల్ అయ్యారు అన్న ప్రశ్నకు చరణ్ మాట్లాడుతూ.. ” ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకన్నా ఎక్కువగా మా అమ్మానాన్న ఎంతో సంతోషించారు. ఇప్పటివరకు ఉపాసనకు నేను ఎక్కువ టైమ్ ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు ఆ టైమ్ మొత్తం లాగేసుకుంటుంది ” అంటూ నవ్వేశాడు.

Amani: ఒంటరిగా రా.. అవకాశాలు ఇస్తాం అన్నారు

ఇక మీరు తండ్రి కాబోతున్నారు అన్న విషయాన్నీ మొదట మీరెవరితో పంచుకున్నారు అన్న ప్రశ్నకు చరణ్ మాట్లాడుతూ.. ” నా తల్లిదండ్రుల తరువాత ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పడం కన్నా ముందు తారక్ తో చెప్పాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా పిల్లల గురించి నా తల్లిదండ్రులు, అభిమానులు ఎంతో ఎదురుచూసారు. మా జీవితంలోకి ఇంకో వ్యక్తి వస్తున్నాడు అంటే నేను ఉపాసన ఎంతగానో ఉప్పొంగిపోయాం. ఇదొక అద్భుతమైన అనుభూతి. ఈ విషయం తెలిశాక నేను, నా భార్య .. మా జీవితాలను కొత్త కోణంలో చూస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments