Site icon NTV Telugu

Hit 2: ‘హిట్ 2’ కిల్లర్ జాతీయ అవార్డు సినిమా హీరో అని తెలుసా..?

Sesh

Sesh

Hit 2: ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. హిట్ 2 కిల్లర్ ఎవరో తెలిసిపోయింది. కూల్ కాప్ కేడిని పరుగులు పెట్టించిన కోడిబుర్ర ఎవరిదో రివీల్ అయ్యింది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారట. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మించాడు. ఇక నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. అయితే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో పలు అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్ రివెంజ్ డ్రామా అంటుండగా.. ఇంకొంతమంది హిట్ కన్నా గొప్పగా లేదు అంటున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమాలో అడివి శేష్ కన్నా పేరు తెచ్చుకొనే పాత్ర కిల్లర్. ఆ పాత్రను ఎవరు చేసి ఉంటారు అని అందరు ఎంతగా ఆలోచించినా అస్సలు బుర్రకే రాలేదు ఆ హీరోను పెడతారని.. అతను ఎవరో కాదు హీరో సుహాస్.

జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో సినిమా హీరో. సుహాస్ నటనకు నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వచ్చిన సుహాస్ కలర్ ఫోటో సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందుకుంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హిట్ 2 లో చేసిన కిల్లర్ పాత్ర సుహాస్ కు కొత్తేమి కాదు. ఇలాంటి సైకో పాత్రనే ఫ్యామిలీ డ్రామా అనే సినిమాలో పోషించాడు. సొంత తల్లిదండ్రులనే హింసించి చంపిన పాత్రలో సుహాస్ నటన బయపెట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమాలోనూ సుహాస్ అద్భుతంగా నటించాడు. హీరోగానే నటించాలి అని కూర్చుకోకుండా ఇలా మంచి పాత్రల్లోకనిపిస్తూ పూర్తి నటుడిగా మారుతున్నాడు. మరి ముందు ముందు సుహాస్ ఎలాంటి పాత్రల్లో నటిస్తాడో చూడాలి.

Exit mobile version