Site icon NTV Telugu

Vishwak Sen: విశ్వక్ దేవరకొండను టార్గెట్ చేశాడా?

Vijay Deverakonda Vs Vishwaksen

Vijay Deverakonda Vs Vishwaksen

Did Vishwak Sen Targetted Vijay Deverakonda: ఆహా ‘ఫ్యామిలీ ధ‌మాకా’ అనే రియాలిటీ షో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుండగా ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రి ముందుకు రానుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతున్న క్రమంలో ఒక ఈవెంట్ నిర్వహించింది ఆహా టీమ్. ఈ క్రమంలో విశ్వక్ మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్ మాట్లాడుతూ బేసికల్లీ అందరం, మనకి అన్నీ తెలుసు అని లెక్కలు వేసుకుంటాం, కొన్ని సార్లు మనం పాన్ ఇండియా సినిమా తీయాలని అనుకుంటాం కానీ అది గల్లీ సినిమా అవుతుంది. కొన్నిసార్లు మనం చిన్న సినిమా తీస్తాం, కాంతార లాంటి సినిమా వాళ్లు ముందు పాన్ ఇండియా అనుకోలేదు కానీ అది పాన్ ఇండియా అయిపోతుంది.

Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్‌.. అసలు సంగతి చెప్పేశాడు!

సినిమాల పరంగా నా ప్లానింగ్ అదే, ఏది 100 కోట్ల సినిమా అవుతుందో ఏది పాన్ ఇండియా అవుతుందో నేను కూడా కూర్చుని తమాషా చూస్తున్న.. కానీ నేను ఈ సినిమా కొడతది అని చెప్పి డైరెక్ట్ గా కూర్చుని ఇది కొడతాది ఇది పాన్ ఇండియా ఇది 200 కోట్లు కొడుతుంది ఇది 100 కోట్లు కొడుతుంది అని లెక్కలేసే అంత మేధావి అయితే కాదు. సినిమాకి 1000 కోట్లు వచ్చేయాలి, నేను పెద్ద హీరో అయిపోవాలి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు వచ్చేయాలి అని ప్రతి సినిమాకి కష్టం పెడుతున్న, ఆ సినిమాకి ఎక్కువ ఈ సినిమాకి తక్కువ అని కాదు అని కామెంట్ చేశాడు. వాస్తవానికి విశ్వక్ పాన్ ఇండియా సినిమాల మీద తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి కామెంట్ చేశాడనే వాదన వినిపిస్తోంది.

వాస్తవానికి గతంలో విజయ్ దేవరకొండ అభిమానులు విశ్వక్సేన్ మధ్య సోషల్ మీడియా వేదికగా కాస్త వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే. ఆ తర్వాత విశ్వక్ ఏమి మాట్లాడినా విజయ్ దేవరకొండతో లింక్ చేసి చూడటం సోషల్ మీడియా నెటిజన్లకు అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అదే కోవలో పాన్ ఇండియా సినిమాల మీద విశ్వక్ చెప్పిన తన అభిప్రాయాన్ని విజయ్ దేవరకొండ చివరి చిత్రం లైగర్ కు ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. వాస్తవానికి ఇక్కడ విజయ్ దేవరకొండను విశ్వక్సేన్ ప్రస్తావించలేదు అలా అని ఫలానా హీరో ఇలా మాట్లాడుతున్నాడు అని కూడా అనలేదు, కేవలం పాన్ ఇండియా సినిమా మీద తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. అయినా ఈ వ్యవహారంలో విజయ్ దేవరకొండ ప్రస్తావనను నెటిజన్లే స్వయంగా తీసుకురావడం గమనార్హం.

Exit mobile version