Site icon NTV Telugu

వర్మ అక్కడా ప్లాఫ్ అయ్యాడా!?

Did Verma flop there also

ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన ఇతగాడి టెక్నిక్ పని చేయటం మానేసింది. దాంతో ఇప్పుడు నటీమణుల సెక్సీ ఇంటర్వ్యూలపై ఫోకస్ పెట్టాడు. అందులో వారి గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేస్తూ రకరకాల యాంగిల్స్ లో ప్రొజెక్ట్ చేస్తూ టాపిక్ ను సెక్స్ వైపు మళ్ళిస్తూ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.

Read Also : మెగాస్టార్ చేతుల మీదుగా “రిపబ్లిక్” ట్రైలర్

అలా బిగ్ బాస్ ఫైనలిస్ట్ అరియానాతో చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ కావటంతో ఆ తర్వాత టిక్ టాక్ స్టార్ అషురెడ్డిని ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఇందులో ఏకంగా చెంపదెబ్బ తిన్నట్లు కూడా నటించేశాడు. అంతే కాదు అషు మదర్ ఈ బోల్డ్ ఇంటర్వ్యూకి మద్దతు ఇచ్చినట్లు చెప్పేశాడు. అయితే వాస్తవ స్థితి అందుకు భిన్నంగా ఉందట. అషు రెడ్డి ఫ్యామిలీ మొత్తం వర్మ స్కిన్ షో ఇంటర్వ్యూకి అప్ సెట్ అయిందట. నిజానికి బిగ్ బాస్ తర్వాత వెండితెరపై వెలగాలని అషు ఆశపడింది. అయితే స్టార్ మా కామెడీ స్టార్స్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వర్మ ఇంటర్వ్యూ అషు ఫ్యామిలీకి ఆందోళన కలిగించిందట. వెండితెరపై గ్లామర్ గా కనిపించటం మంచిదే కానీ ఇలా కావాలని బోల్డ్ గా రావటం మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాదని అర్థం అయిందట. అందరికీ అర్థమైన ఈ విషయం రామ్ గోపాల్ వర్మకి ఎప్పటికి అర్థం అవుతుందో మరి!

Exit mobile version