అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లిరోజు సమంత ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పెళ్లి అనుకున్నప్పటినుంచి పెళ్లి అయ్యేవరకు అమ్మడు వేసుకున్న ప్రతి డ్రెస్ వైరల్ గా మారిందే. ఇక సామ్ పెళ్లి చీర గురించి అయితే టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీల వారు కథలు కథలుగా చెప్పుకున్నారు. అప్పట్లో సామ్ పెళ్లి చీర టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తమ పరిచయం నుంచి.. పెళ్లి వరకు జరిగిన ఘట్టాలను చీరపై నేయించి కట్టుకుంది.. ఇక హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్ళిలో సామ్.. నాగ చైతన్య అమ్మమ్మ చీరను ధరించింది. ఆ చీర పొందడం ఎంతో అదృష్టమని కూడా చెప్పుకోచ్చింది. ఇక తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ పెళ్లి చీర, చైతన్యకు సంబంధించిన ప్రతి వస్తువును ఆమె అక్కినేని కుటంబానికి తిరిగి ఇచ్చేసిందట. చైతు జ్ఞాపకాలను కనీసం గుర్తుతెచ్చే ఏ వస్తువును సామ్ దగ్గరికి కూడా రానివ్వడం లేదట.. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. క్షణం తీరిక కూడా లేకుండా షూటింగ్స్ టోన్ గడుపుతుంది.
