NTV Telugu Site icon

Samantha : సమంత సౌత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా..?

Whatsapp Image 2023 06 12 At 9.24.20 Pm

Whatsapp Image 2023 06 12 At 9.24.20 Pm

తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించింది సమంత. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో అంతగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు.సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు.

అందుకే ఇక పై అన్ని సినిమా లు అక్కడే చేయాలని తన పూర్తి సమయం అక్కడే కేటాయించాలని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక సమంత సౌత్ సినిమాల విషయానికి వస్తే స్వయం గా తెలుగు హీరోలు లేదా ఇతర సౌత్ హీరోలు ఆమె ను పట్టించుకోవడం లేదేమో అంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న రూమర్ ప్రకారం సమంత తెలుగు లో కంటే ఎక్కువగా హిందీ లో సినిమా చేయాలని ఎంతో ఆశ పడుతోందని అందుకే సమంత ఇక్కడ సినిమా ల్లో ఆఫర్లు వచ్చినా కూడా నో చెప్పేస్తుంది అని సమాచారం.అయితే సమంత కు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క స్టార్ హీరో సినిమా ల్లో కూడా ఛాన్స్ అయితే రాలేదు. స్టార్ హీరోల సినిమా లకు ఆమె జోడీ కాదు అంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు. ఎందుకు అంటే ఆమె పర్సనల్ లైఫ్ లో ని వివాదాల కారణంగా తెలుగు హీరోలు ఆమె తో సినిమా లను చేసేందుకు ముందుకు రావట్లేదని సోషల్ మీడియా లో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.మొత్తానికి సమంత ను తెలుగు హీరోలు కొద్ది మంది మాత్రమే ఇష్టపడుతున్నారు.. ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె ను అంతగా పట్టించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియా లో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి.