Site icon NTV Telugu

RRR : అలియాని మర్చిపోయారా?

Alia-Bhatt

RRR : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకుంది. అభిమానుల నుంచి, సన్నిహితులు, సెలెబ్రిటీల నుండి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఇక అలియా పుట్టినరోజు సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు అలియా భట్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు అలియా అంటే ప్రేక్షకులకు RRR మాత్రమే గుర్తొస్తోంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో RRR టీం నుంచి అలియా బర్త్ డే స్పెషల్ గా ఏదైనా ఉంటుందేమో అని ఆమె అభిమానులు భావించారు. కానీ వారికి నిరాశ తప్పలేదు. ఎందుకంటే స్పెషల్ ట్రీట్ ను పక్కన పెడితే… కనీసం అలియాకు బర్త్ డే విషెస్ కూడా చాలా లేట్ గా చెప్పింది RRR టీం. అయితే ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు విడుదల చేసిన అలియా భట్ లుక్‌ను దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. దీనికి అలియా భట్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు

వాస్తవానికి RRR టీమ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ స్టార్స్, టెక్నీషియన్‌లకు రోజు మొదట్లోనే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ అలియా భట్ లాంటి బ్యూటీ పుట్టినరోజును మాత్రం దాదాపుగా పట్టించుకోలేదు. RRR మేకర్స్ ఈ సందర్భాన్ని సినిమా ప్రమోషన్ల కోసం ఎంతోకొంత ఉపయోగించుకోవచ్చు. కానీ వాళ్ళు అసలు అలియాను పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం ఒక పిక్ తో ఆమెకు బర్త్ డే విషెస్ సరిపెట్టేశారు. మరోవైపు భారీ విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ RRR సెకండ్ రౌండ్ ప్రమోషన్లలో అలియా పెద్దగా కన్పించట్లేదు !

Exit mobile version