NTV Telugu Site icon

Pushpa 2: పుష్పగాడు దిగుతున్నాడా? లేదా?

Pushpa 2

Pushpa 2

Did Pushpa 2 postpones the release date: మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అజయ్ దేవగన్ సింగం అగైన్ సినిమాతో పోటీ పడాల్సి ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందని, సింగం ఎగైన్ సోలో రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోవడంతో నమ్మలేం. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతాన్ని క్యాష్ చేసుకోవాలని చాలా ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అభిమానులు ఈ పరిణామంతో చాలా నిరుత్సాహానికి గురయ్యారు.

Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్ హాసన్, వైరముత్తు.. లైంగిక వేధింపుదారుడంటూ సింగర్ చిన్మయి ఫైర్..

పుష్ప 2 బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించింది. రికార్డ్ బ్రేకింగ్ నంబర్‌లను నమోదు చేయడానికి ఈ స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ గొప్ప అవకాశం. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. ఖచ్చితంగా సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. సుకుమార్ సినిమాల విషయంలో ఇలాంటి జాప్యాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. పర్ఫెక్షన్‌తో షూట్ చేయడానికి సుకుమార్ చాలా టైమ్ తీసుకుంటాడు. పుష్ప 2 విడుదలను వాయిదా వేస్తే, స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో వరుస సెలవులతో ఉన్న జాక్‌పాట్ తేదీ కావడంతో చాలా సినిమాలు ఆ తేదీని సెట్ చేసుకుంటాయి అని భావించారు. కానీ అసలు సినిమా వాయిదా పడే అవకాశమే లేదని తెలియడంతో ఇక అలాంటివి ఏమీ లేవని చెప్పచ్చు.