Varanasi OTT Deal : ‘వారణాసి’ ఓటీటీ డీల్ సెట్టా… నెట్ ఫ్లిక్స్ రిప్లై వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi OTT Deal : భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ ఒకటి. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే1,200 కోట్ల భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ ఎలిమెంట్స్ తో సాగే కథతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ‘వారణాసి’ ఓటీటీ హక్కులు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందా? లేక ఇంకా చర్చల దశలోనే ఉన్నాయా? నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఉన్నతాధికారి చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. అసలు ఆమె ఏమన్నారు? ఈ ఊహాగానాలకు కారణమేంటి?
నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ ప్రశ్న ఎదురైంది. ‘వారణాసి’ స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతమయ్యాయా అని అడగ్గా, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ చిరునవ్వుతో స్పందించారు. కొన్ని విషయాలు భవిష్యత్తులోనే సర్ప్రైజ్గా ఉండాలని ఆమె చెప్పడంతో అక్కడున్న వారిలో ఆసక్తి మరింత పెరిగింది. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వకపోయినా, ఆమె సమాధానం ఓటీటీ ఒప్పందంపై ఓ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా విశేష ఆదరణ పొందాయని గుర్తు చేసినప్పుడు, గొప్ప కథలు, టాలెంట్ క్రియేటర్స్ ఎప్పుడూ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ప్రయాణిస్తారని మోనికా వ్యాఖ్యానించారు. దీంతో ‘వారణాసి’ డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇప్పటివరకు ఈ ఒప్పందంపై చిత్ర బృందం నుంచి, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Also Read
- Ramayana Review: రామాయణ మూవీ రివ్యూ..
- Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
- Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
- Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా జోనాస్ నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. పౌరాణిక అంశాలను ప్రపంచస్థాయి యాక్షన్ అడ్వెంచర్‌తో మేళవించిన ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతోంది. ప్రస్తుతం పలు దేశాల్లో షూటింగ్ కొనసాగిస్తున్న ‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓటీటీ ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, నెట్‌ఫ్లిక్స్ వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఆసక్తి మరోసారి రెట్టింపైంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
CM Revanth Reddy: “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!