Site icon NTV Telugu

Drugs Case: నాగబాబు వీడియో రిలీజ్ చేసి తప్పు చేశారా?

Naga Babu 4

Naga Babu 4

శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయిన నేపథ్యంలో నిహారిక ఆ పార్టీలో ఉండటానికి కారణం చెప్పకుండా పోలీసులు నిహారిక తప్పులేదని చెప్పారంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదం అవుతోంది.

నిహారిక గురించి ‘షీ ఈజ్ క్లియర్’ అంటూ తమ కాన్షన్ క్లియర్‌గా ఉందని.. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్ స్ప్రెడ్ చేయవద్దని నాగబాబు కోరారు. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ వచ్చినపుడు సాధారణంగా సెలబ్రెటీలు ఎవరూ స్పందించరు. పోలీసుల వైపు నుంచే క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆయన స్పందించి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సమయం దాటినా దాటి పబ్ తెరిచి ఉండటం వల్లే పోలీసుల రైడ్ జరిగిందని నాగబాబు సెలవిచ్చారు. కానీ అంత లేట్ నైట్ నిహారిక అక్కడ ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఏది ఏమైనా నాగబాబు తన వీడియో ద్వారా నిహారికకు మంచి కంటే చెడే ఎక్కువ చేశారని కామెంట్లు వినపడుతున్నాయి. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

https://ntvtelugu.com/nagababu-clarity-on-niharika-over-radisson-blu-hotel-party/

Exit mobile version