NTV Telugu Site icon

కరణ్ సమక్షంలో అరుణిత, పవన్ దీప్ ‘సెమీ ఫైనల్’ రొమాన్స్!

Did Karan Johar just confirm that Pawandeep Rajan and Arunita Kanjilal are a couple?

కూటి కోసం కోటి విద్యలు! టీఆర్పీల కోసం శతకోటి వ్యూహాలు! ఇండియన్ ఐడల్ 12 రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న వారికి ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆగస్ట్ 15న ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. పన్నెండు గంటల పాటూ మ్యూజికల్ మారథన్ నడిపంచబోతున్నారు బుల్లితెరపై! అయితే, ఇండియన్ ఐడల్ 12 అంటే కేవలం పాటలే కాదు కదా… పబ్లిసిటీ పాట్లు కూడా! ఈ షోలో నిర్వాహకులు మొదట్నుంచీ అంతా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కంటెస్టెంట్స్ మామూలుగా పాడినా కూడా ‘అద్భుతం’ అంటూ జడ్జీలు కూర్చీల్లోంచి లేచి గాల్లోకి ఎగరటం లాంటి ‘అతి’ సర్వసాధారణం అయిపోయింది. దానికి తోడుగా టాప్ కంటెస్టెంట్స్ అయిన అరుణిత కంజిలాల్, పవన్ దీప్ రజన్ మధ్య లవ్ యాంగిల్ ఇంకొక టీఆర్పీ వ్యవహారంగా మారిపోయింది. సెమీ ఫైనల్ ఎపిసోడ్ తాలూకూ ప్రోమోలోనూ వారిద్దరి మధ్యా ‘కుచ్ కుచ్ హోరహా హై’ అన్నట్టుగా సీన్స్ బిల్డప్ చేశారు…

మరో వారంలో ముగింపుకు రాబోతోన్న ఇండియన్ ఐడల్ 12 ఈసారి కరణ్‌ జోహర్ ముఖ్యఅతిథిగా కొనసాగబోతోంది. ఆయన ముందు అరుణిత ‘కుచ్ కుచ్ హోతా హై’ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అక్కడితో ఆగక ఆ సినిమాలోని ఐకానిక్ ‘రెయిన్ సీన్’ రీ క్రియేట్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. పవన్ దీప్ తో కలసి రొమాంటిక్ గా లవ్ ప్రపోజల్ సన్నివేశంలో అరుణిత మెరిసిపోయింది! ఇక యంగ్ సింగర్స్ ఇద్దరూ ఓ వైపు రొమాంటిక్ సీన్ లో జీవించేస్తుంటే… కరణ్ జోహర్ అయితే ఏకంగా అసలు సంగతి సూటిగా బయటపెట్టేశాడు! ఇంతకాలం అందరూ అరుణిత, పవన్ ప్రేమికులంటూ ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తుండగా… కేజో మాత్రం ”ప్రతీ అంజలికి రాహుల్ అవసరం… ప్రతీ అరుణితకి పవన్ దీప్ అవసరం” అంటూ కుండబద్ధలు కొట్టేశాడు! వారిద్దరూ కపుల్ అంటూ ప్రస్తుతం ఇంటర్నెట్ లో మార్మోగిపోతోంది!

Read Also : “మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!

ఇండియన్ ఐడల్ తాజా ప్రోమో చూసిన నెటిజన్స్ మరో అంశం కూడా తెగ ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. పవన్ దీప్, అరుణిత రొమాంటిక్ మూడ్ లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ‘ఆమె నడుముపై అతను చేయి వేయలేదు’! ఈ విషయాన్ని ‘కనిపెట్టిన’ ఆన్ లైన్ అభిమానులు ‘వపన్ దీప్ ట్రూ జెంటిల్మాన్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు! అయితే, కొందరు మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్’ అంటూ కొట్టిపారేస్తున్నారు. అరుణిత, పవన్ దీప్ లవ్వర్స్ కాదు కాబట్టే అతను సిగ్గుపడిపోతూ, ఇబ్బందిగా డ్యాన్స్ చేశాడని వారు వాదిస్తున్నారు. అరుణిత నడుము మీద పవన్ దీప్ చేయి వేయకపోవటానికి కారణం… వారిది టీఆర్పీల కోసం సృష్టించిన కల్పిత ప్రేమ కావటమే అంటున్నారు! ఏది నిజమో రానున్న కాలమే తేల్చాలి…

ఇండియన్ ఐడల్ 12 ఈ వారం ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అప్పుడు మిగిలే ఫైనల్ ఫై నుంచీ గ్రాండ్ ఫినాలేలో ‘ఇండియన్ ఐడల్ 2021’ను ఎంపిక చేస్తారు! ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ లో అరుణిత, పవన్ దీప్ కాకుండా మహ్మద్ దానిష్, నిహాల్ తౌరో, సయాలీ కాంబ్లీ ఉన్నారు. తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ కూడా గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించేందుకు రేసులో ఉంది…

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)