NTV Telugu Site icon

Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా కు బీచ్ అంటే అంత ఇష్టమా..?

Whatsapp Image 2023 06 25 At 7.48.24 Pm

Whatsapp Image 2023 06 25 At 7.48.24 Pm

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిని బాగా ఆకట్టుకుంది.. ఇక గతంలో ఇలియానా డేట్స్ కోసం తెగ ఎదురు చూసేవారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఆమె కు అస్సలు అవకాశాలు రావడం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలు ఇలియానా తోనే సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఇలియానా తన నడుము అందాల తో అందరిని మాయ చేసింది.ఇలియానా నడుముకు ఉండే ఆ క్రేజ్ వేరు. ఇలియానా తన నడుము అందాలతో అందరిని ఇట్టే పడేస్తుంది.ఇలియానా మంచి నటిగా కూడా మెప్పించింది.సౌత్ నుంచి నార్త్ వరకు తన నటన తో ఎన్నో సినిమా అవకాశాలు అందుకుంది.. ఇక ఇలియానా ఈ మధ్య కాలంలో పెళ్లికాకుండానే తల్లి అయిన విషయం తెలిసిందే.తాను ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఇలియానా కి పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ సోషల్ మీడియా లో తెగ వార్తలు వస్తున్నాయి.

తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసింది కానీ అందులో అతడి ఫేస్ ను మాత్రం సరిగ్గా చూపించలేదు.ఇటీవల కానీ తన బేబీ బంప్ ఫోటోలు నెట్టింట షేర్ చేసింది ఇలియానా. తన ప్రెగ్నెంట్ జర్నీ గురించి కొన్ని విశేషాలను తన అభిమానుల తో పంచుకుంది ఇలియానా.. ఇదిలా ఉంటే ఇలియానా ఎప్పుడు కూడా బీచ్ లోనే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అని చాలా మంది ప్రశ్నించ గా తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. అదేంటంటే ఇలియానా కి బీచ్ అంటే ఎంతో ఇష్టమట.బీచ్ లో ఉండే ప్రశాంతమైన వాతావరణం ఆమెకు బాగానే నచ్చుతుందట. ఈ కారణంతోనే ఆమె ఎక్కువగా బీచ్ లో గడపడానికి ఇష్ట పడుతుందని సమాచారం. అందుకే ఆమె ఎక్కువగా బీచ్ లో దిగిన ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది

Show comments