NTV Telugu Site icon

Director Krish: వీరమల్లు నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? అసలు కథ ఏంటి?

Krish

Krish

Did Director Krish Walked out from Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం క్లారిటీ లేదు. కొండ పొలం అనే సినిమా చేసిన తర్వాత క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే ఒక బందిపోటు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ప్రచారం ఉంది. అయితే ఈ సినిమా అనూహ్యంగా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.

Modi on RRR: ఆర్ఆర్ఆర్ పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పుడు ఆ ప్రచారానికి ఊతమిస్తూ నిన్న ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్లలో క్రిష్ పేరు లేపేశారు సినిమా యూనిట్. అయితే క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం వల్లే ఆయన పేరుని సినిమా పోస్టర్ మీద నుంచి తప్పించారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ సినిమా అప్డేట్ ఇస్తూ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్లో మాత్రం క్రిష్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేశారు. నిజంగానే క్రిష్ సినిమా నుంచి తప్పుకుంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ ని మాత్రం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఎందుకు సినిమా పోస్టర్ మీద ఆయన పేరు లేదు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఆ మధ్య క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. జ్యోతికృష్ణ గతంలో పలు సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉండడంతో ఆయన సినిమాని టేకప్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన పేరును కూడా ట్విట్టర్ లో టాగ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన క్లారిటీ లేదు కానీ ఇప్పుడు క్రిష్ పేరు తొలగించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.

Show comments