Modi Intresting Comments on RRR Movie: ప్రధాని మోదీ RRR మూవీని ప్రశంసించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ “తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశానికి RRR వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించింది, కానీ నేడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు RR పన్ను విధించింది. RRR చిత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి తెచ్చింది, అయితే ఈ RR పన్ను మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. తెలంగాణలో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఇక్కడ వసూలు చేసిన మొత్తం నల్లధనంలో కొంత భాగాన్ని RR పన్ను రూపంలో ఢిల్లీకి చెల్లించాలని ఈ RR పన్ను గురించి తెలంగాణాలో ప్రతిచోటా చర్చ జరుగుతోందమొ ఆయన అన్నారు.
Anupam Kher: నా ఫేవరేట్ ఎన్టీఆర్ ను కలిశా.. అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఆర్ఆర్ అంటే ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా అంటూ సభలోని ప్రజలను మోదీ అడగటంతో.. పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్‌ను అడ్డుకోకపోతే సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే గూటి పక్షులని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు. గతంలో ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ తొక్కిపెట్టిందని ఇప్పుడు.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని హడావుడి చేసి.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కన పడేశారు అని విమర్శించారు మోదీ.