Sai Madhav Burra was replaced by Trivikram for Bro Movie: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘బ్రో’ సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమాను పవన్‌తో చేయాలని డైరెక్టర్ సముద్రఖనికి సూచించింది, కాంబినేషన్లు సెట్ చేసింది అందరూ గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్. ఈ విషయాన్ని సముద్రఖని ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తమిళ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా అనిపించే ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ సినిమాకి డైలాగ్స్ తో పాటుగా స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించినా మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడని ఒక టాక్ అయితే ఉంది. అయితే నిజానికి త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ అప్ టు మార్క్ లేవని వార్తలు వినిపిస్తున్నాయ్.
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ది శునకానందం.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం
అయితే నిజానికి తొలుత మాటల కోసం సాయి మాధవ్ బుర్రా అనుకుంటే త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడని అంటున్నారు. అయితే అసలు ఏమైందంటే ముందుగా త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను రూపొందించి, డైలాగ్ రైటింగ్ కోసం మాధవ్‌కు ఇచ్చాడని అంటున్నారు. ముందు మాధవ్ చెప్పిన డైలాగ్స్‌కి త్రివిక్రమ్, సముద్రఖని ఇద్దరూ ఖుషీ అయి ఫైనల్ చేశారు. కానీ పవన్ పాత్ర సాయితేజ్ కంటే తేలికగా ఉందని భావించిన త్రివిక్రమ్ దానిని పూర్తిగా తిరగరాయమని కోరారని అయితే ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ రైటర్ గా ఉన్న సాయి మాధవ్ కమిట్‌మెంట్స్ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు డైలాగ్ రైటర్‌గా మారాడని అంటున్నారు. ఇక మొత్తం మీద ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అయితే సినిమా ఇంకెలా ఉండేదో అనే చర్చ అయితే జరుగుతోంది.