Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ధురందర్ 2’ సృష్టిస్తున్న సంచలనం కేవలం సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్కు మాత్రమే పరిమితం కాలేదు, దశాబ్దాల కాలంగా కరాచీ అండర్‌వరల్డ్‌లో పాతిపెట్టబడిన చీకటి కోణాలను మళ్ళీ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ బలోచ్’ పాత్ర, వాస్తవ ప్రపంచంలో ఒకప్పుడు కరాచీని గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైత్ భీభత్సాన్ని గుర్తు చేస్తోంది. భారత నిఘా వర్గాల కథనం ప్రకారం.. మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు నూర్ ఉల్ హక్ (అలియాస్ నూరా) మరణం వెనుక ఉన్నది రెహ్మాన్ డకైత్ అని నమ్ముతారు. ఇదే విషయాన్నీ రెహమాన్ ను అంతమొందించిన అనంతరం ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర మేజర్ ఇక్బాల్ పాత్రకు చెబుతుంది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు, అండర్‌వరల్డ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉదంతంగా చెబుతారు. నూరాను అపహరించి, చిత్రహింసలకు గురిచేసి, తలలోకి బుల్లెట్లు దించి చంపినట్లు సమాచారం, ఆ తర్వాత అతని మృతదేహాన్ని దావూద్ నివాసం సమీపంలోనే పడేసి, డీ-కంపెనీకి నేరుగా సవాలు విసిరాడు రెహ్మాన్. అప్పట్లో దావూద్ కుటుంబం ఇది గుండెపోటుతో జరిగిన మరణమని నమ్మబలికినప్పటికీ, ల్యారీ ప్రాంత గ్యాంగ్ వార్ శైలిలోనే ఈ హత్య జరిగిందని భారత ఏజెన్సీలు తేల్చిచెప్పాయి.
Also Read: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్
Also Read
- Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
- Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
- Suriya : ఆగస్టు 14న 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ ఫిక్స్
- Obsession : 0.75 మిలియన్ డాలర్లతో సినిమా తీసిన యూట్యూబర్.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఆడియన్స్
ఎవరీ రెహ్మాన్ బలోచ్?
సినిమాలో రెహ్మాన్ బలోచ్‌గా అక్షయ్ ఖన్నా నటన ఎంత క్రూరంగా ఉందో, నిజ జీవితంలో రెహ్మాన్ డకైత్ అంతకంటే భయంకరమైన వ్యక్తని చెబుతారు పాక్ జనం. 1975లో పుట్టిన సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచ్, చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసై నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హాజీ లాలూ ముఠాను తన హస్తగతం చేసుకున్న తర్వాత.. వసూళ్లు, కాంట్రాక్ట్ హత్యలు, రాజకీయ బెదిరింపులతో కరాచీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఉజైర్ బలోచ్, బాబా లాడ్లా వంటి వారితో కలిసి తను సృష్టించిన భయానక వాతావరణం ల్యారీ వీధుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని అంటుంటారు. దావూద్ కుటుంబ సభ్యుడినే టార్గెట్ చేయడం ద్వారా, తను ఎవరికీ తలవంచనని రెహ్మాన్ నిరూపించుకోవాలనుకున్నాడు అందుకే ఇది కేవలం వ్యక్తిగత కక్ష కాదు, కరాచీ నేర సామ్రాజ్యంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసిన సాహసం.
అయితే రెహ్మాన్ డకైత్ హవా 2009 ఆగస్టులో ముగిసింది. కరాచీలో జరిగిన ఒక పోలీస్ ఎన్కౌంటర్లో 34 ఏళ్ల వయసులో అతను హతమయ్యాడు, అతని మరణం తర్వాత ఉజైర్ బలోచ్ ఆ నెట్‌వర్క్‌ను నడిపించడంతో ల్యారీలో హింస మాత్రం ఆగలేదు. ఇక ‘ధురందర్’ ద్వారా ఈ గ్యాంగ్ వార్ దృశ్యాలు మళ్ళీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సినిమాలో కొన్ని సంఘటనలను కల్పితంగా చూపించినప్పటికీ, దావూద్ సోదరుడి హత్యకు సంబంధించిన వాస్తవ కథనాలు మాత్రం ఇప్పటికీ అండర్‌వరల్డ్ చరిత్రలో అత్యంత భయంకరమైన అధ్యాయంగానే మిగిలిపోయాయి.
తాజావార్తలు
-
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
-
Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
-
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్‌ను వదులుకున్నారు..
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!