NTV Telugu Site icon

Dhruva Natchathiram: లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే

Vikram

Vikram

Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఎప్పుడు రిలీజ్ అన్నా కూడా ఏదో ఒక కారణం వలన వాయిదా పడుతూ వస్తుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వదు.. కన్ఫర్మ్ అని అభిమానులు ఆశలు కూడా వదులుకున్నారు. ఇక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి ఒక సాంగ్ పోస్టరో.. లేక టీజర్ పోస్టరో రిలీజ్ చేసి అంచనాలు పెంచేస్తూ ఉంటారు. ఇక ఈసారి మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేలానే కనిపిస్తుంది. నవంబర్ 24 న ధృవ నక్షత్రం తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతుందని మేకర్స్ ఖచ్చితంగా చెప్పేశారు. ఇక దీంతో పాటు సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు.

Vidushi Swaroop: వ్యభిచారం చాలా కూల్.. ఛీ.. సిగ్గులేదు.. నువ్వసలు ఆడదానివేనా

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ముంబై దాడుల తరువాత అలాంటి ఒక దాడిని ఆపడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి.. ఒక స్పై అండర్ కవర్ ఆఫీసర్ కు ఒక ఆపరేషన్ చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆపరేషన్ కు బేస్ మెంట్ అని పేరు పెడతారు. ఇక ఈ బేస్ మెంట్ ఆపరేషన్ ను క్రికెట్ తో పోలుస్తూ.. 10 మంది టీమ్ ను రెడీ చేయమని చెప్తాడు. ఇక వీరిపైన 11 వ వాడు ఎవరికి తెలియకుండా ఆపరేషన్ లీడ్ చేయాలి అని చెప్తాడు.. ఆ 11 వ వాడే.. మన హీరో జాన్. అన్నింటిలో స్పెషలిస్ట్. ఇక ఈ టీమ్.. బేస్ మెంట్ ఆపరేషన్ ను పూర్తిచేసిందా.. ? జాన్ ప్రియురాలు రీతూ వర్మ కూడా ఇందులో జాయిన్ అయ్యిందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. గౌతమ్ మీనన్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నింపేశాడు. విక్రమ్ పదేళ్లు అయినా ఇప్పడూ ఎలా ఉన్నాడో.. అప్పుడు అలానే కనిపిస్తున్నాడు. ట్రైలర్ తో సినిమాపై హైప్ తెచ్చేశారు. లేట్ గా వస్తున్నా.. కంటెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఉండడంతో అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తారనే అని అనుకోవొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments