NTV Telugu Site icon

Dhruva Natchathiram: ఈ సినిమా చూడకుండానే పోతామనుకున్నాం.. చివరికి వచ్చేస్తోంది

Dn

Dn

Dhruva Natchathiram: కొన్ని కాంబోల సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేక్షకులకు..హిట్ కాంబోస్ అయితే మరింత ఆసక్తి, ఆత్రుత ఉంటాయి. స్టార్ డైరెక్టర్- స్టార్ హీరో కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ కాంబోకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తోడైతే.. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అలా అభిమానులందరి మనసులో ఎన్నో అంచనాలను రేకెత్తించిన సినిమా ధృవ నక్షత్రం. చియాన్ విక్రమ్, రీతువర్మ జంటగా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధృవ నక్షత్రం. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ 2017లో మొదలయ్యింది. ఇప్పటికి ఐదేళ్లు అవుతున్నా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. మేకర్స్ కు డైరెక్టర్ కు మధ్య జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీల వలన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.

నిజం చెప్పాలంటే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హీరోను మాస్ కాప్ గా హీరోయిన్ ను క్లాసిక్ విమెన్ గా చూపించాలంటే గౌతమ్ తరువాతే ఎవరైనా.. ఈ సినిమాలో విక్రమ్ ను కూడా ఒక పవర్ ఫుల్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అసలు సినిమాను రిలీజ్ చేస్తారా..? అని అనుమానాలు వ్యక్తం చేసి చేసి అసలు ఈ సినిమా ఒకటి ఉంది అన్న విషయమే అభిమానులు మర్చిపోయారు. ఇక దాదాపు ఐదేళ్ల తరువాత ఈ చిత్రం రిలీజ్ కు నోచుకుంది. విబేధాలు అన్ని తొలగిపోవడంతో త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించనుందట. ఈ వార్త వినదంతినే విక్రమ్ అభిమానులు ఊపిరి పీల్చుకొని.. ఈ సినిమా చూడకుండానే పోతామనుకున్నాం.. చివరికి వచ్చేస్తోంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఐదేళ్ల తరువాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments