Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ జోరు ఈ మధ్యకాలంలో ఇతర భాషల్లోనూ గట్టిగా కనిపిస్తోంది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉన్న కథలతో పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ (తమిళం) మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిన మైత్రీ మేకర్స్, తాజాగా అక్కడ తమ నాలుగవ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. కోలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ వారసుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ సరసన ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ధృవ్ కెరీర్లో ఇది 4వ చిత్రం (#DV4) కావడం విశేషం. పూర్తి స్థాయి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
చెన్నైలోని MRC నగర్లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ షాట్‌కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశితో పాటు టాలీవుడ్ నుంచి ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు. హీరో ధృవ్ విక్రమ్, డైరెక్టర్ కరణ్ సహా చిత్ర యూనిట్ మొత్తం ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ధృవ్ విక్రమ్, ఈ సినిమాతో మొదటిసారి ఒక ఊర మాస్ ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను, కమర్షియల్ లవర్స్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ ఈ కథను సిద్ధం చేశారు. కరణ్ అండ్ సబీ సంయుక్తంగా ఈ చిత్రానికి పవర్ఫుల్ స్క్రీన్‌ప్లేను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!