Tantra: అనన్య నాగళ్ళ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగమ్మాయిగా మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస ఓఫర్స్ తో దూసుకుపోతున్న అనన్య నటిస్తున్న చిత్రం తంత్ర. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది. ధీరే.. ధీరే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాంగ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. లంగావోణిలో అనన్య ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ..” గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు మరియు రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ గారికి, అనసూయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
