Site icon NTV Telugu

Laksh Chadalavada: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ధీర’

Dheera

Dheera

‘వలయం’తో విమర్శకుల ప్రశంసలందుకున్న లక్ష్ చదలవాడ త్వరలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజతో మొదలైంది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలోఈ సినిమా రూపొందుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సంస్థలో ఇది 12వ సినిమా. దీనికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుత తరం కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Exit mobile version