NTV Telugu Site icon

Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం అదేనా..?

Chaitanya

Chaitanya

Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం బుల్లితెరను షేక్ చేస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పు ఇచ్చినవాళ్లు టార్చర్ పెడుతున్నారని, తల్లిదండ్రులను క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా తన ప్రాణాలను వదిలేశాడు. ఇక వీడియోలో చివరన చైతన్య మాట్లాడిన మాటలు ఎంతోమందిని కదిలించింది. “ఢీ నేమ్ ఇస్తుంది.. ఫేమ్ ఇస్తుంది కానీ, సంపాదన చాలా తక్కువ ఇస్తుంది. జబర్దస్త్ షోలో అయితే సంపాదన ఎక్కువ వస్తుంది. కానీ, అయినా ఢీలోనే నిలబడ్డాం, కష్టపడ్డాం. మేము ఇల్లు, టీవీలు ఏమి కొనుక్కోలేకపోయాం కానీ, నేమ్, ఫేమ్ తెచ్చుకున్నాం” అని కంటనీరు పెట్టుకున్నాడు. ఇక దీంతో ఢీ అభిమానులు మల్లెమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢీ కంటెస్టెంట్స్ కు జబర్దస్త్ లో ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Dhee Choreographer Chaitanya: బ్రేకింగ్.. ఆ బాధ తట్టుకోలేక ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

ఇక చైతన్య మృతితో జబర్దస్త్, ఢీ అభిమానుల మధ్య వైరం మొదలయ్యింది. జబర్దస్త్ లో వల్గర్ కామెడీ ఉంటుంది. ఢీలో స్టెప్స్ వేసి, చెమటోడ్చి, ఫ్యాషన్ తో జడ్జీలను ఎంత మెప్పించిన వారు నెలకు సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. కామెడీ చేయడం అంత సులువు కాదని, వినోదాన్ని పంచే షోకు కొంచెం ఎక్కువ ఇచ్చిన పర్లేదని అంటూనే.. ఆపదలో ఉన్న కంటెస్టెంట్స్ ను ఆదుకోవడం మల్లెమాల బాధ్యత అని, చైతన్య కు మల్లెమాల సపోర్ట్ గా నిలిస్తే బావుండేది అని కొందరు చెప్పుకొస్తున్నారు. మల్లెమాల ఢీ లో కంటే జబర్దస్త్ లో ఉన్నవారికే ఎక్కువ శాలరీలు ఇవ్వడం, దానివలన అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేకనే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఢీ లో ఎలాంటి డ్యాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాళ్లు చేతులు విరగ్గొట్టుకొని డ్యాన్స్ కోసం ప్రాణం పెట్టె కంటెస్టెంట్స్ కోసం ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత మల్లెమాలకు ఉంటుందని, వారు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఏదిఏమైనా అతి చిన్న వయస్సులోనే చైతన్య మృతి చెందడం బాధాకరమైన విషయమని, వారి కుటుంబానికి, మల్లెమాల ఏదైనా ఆర్థికంగా సహాయం అందిస్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు.