Site icon NTV Telugu

Dharma Productions: యువ హీరోని విడిచిపెట్టని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. వరుసగా సినిమా ఛాన్స్‌లు!

Dharma Productions Kartik Aaryan

Dharma Productions Kartik Aaryan

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టిజియస్ ప్రొడక్షన్ హౌజ్ ‘ధర్మ ప్రొడక్షన్‌’లో వర్క్ చేయాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ యువ హీరో ‘కార్తీక్ ఆర్యన్‌’ది కూడా. టీ-సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం ‘దోస్తానా 2’ కోసం సైన్ చేస్తే.. కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు.

ధర్మ ప్రొడక్షన్‌లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటోన్న సమయంలో కరణ్- కార్తీక్ మధ్య సయోధ్య కుదిరింది. అలా వచ్చిన ఆఫరే.. తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సెట్స్ పై ఉండగానే.. ‘నాగ్జిల్లా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రానికి కార్తీక్ ఆర్యన్‌ను కమిట్ చేసేసింది కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ. ఇప్పుడు మరో ఛాన్స్ కట్టబెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: Danni Wyatt: పేరెంట్ అవుతున్న లెస్బియన్ క్రికెటర్.. ఒకప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజ్!

కార్తీక్ ఆర్యన్‌తో ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ దర్శకుడు సందీప్ మోడీ కాంబోలో ఓ మూవీకి ప్లాన్ చేసిందట ధర్మ ప్రొడక్షన్ హౌస్. గతంలో ఈ ఇద్దరి కాంబోలోనే వార్ డ్రామా చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సందీప్- కార్తీక్ ఆర్యన్ ఓ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట. ఫ్రెష్ స్టోరీ అండ్ స్క్రిప్ట్‌తో వర్క్ చేయాలనుకుంటున్నారన్నది బీటౌన్ బజ్. కార్తీక్‌తో రూపొందిస్తున్న రెండు సినిమాల కన్నా డిఫరెంట్‌గా నిర్మించబోతోందట ధర్మ ప్రొడక్షన్. ప్రస్తుతం టీ-సిరీస్‌లో సినిమా చేస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను వరుసగా ఛాన్సులిస్తూ గ్రాబ్ చేస్తోంది ప్రొడక్షన్ హౌస్. త్రీ ఖాన్స్ తర్వాత బాలీవుడ్‌ను ఏలే లక్షణాలను అతడిలో గుర్తించిందేమో ఏమో. కార్తీక్ ఆర్యన్ ఇమేజ్ భూల్ భూలయ్యా 3 తర్వాతే పెరిగింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు కట్టబెడుతోంది కరణ్ సంస్థ.

Exit mobile version