కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుడి ప్రయాణాన్ని తెరపై చూపించనున్నారు. ఇందులో ధనుష్ కళాశాల ఉపాధ్యాయునిగా కనిపించనున్నాడు. ఇక ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ‘సార్’ ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ డ్రామా గురించి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
Read Also : మాస్ మహరాజా.. సందడే సందడి
ప్రస్తుతం ‘సార్’ షూటింగ్‌లో హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరోయిన్ సంయుక్తా మీనన్ తప్పుకున్నట్టుగా వార్తలు రాగా, ఆమె వాటిని కొట్టి పారేసింది. అయితే తాజాగా ‘సార్’ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ మధ్యలోనే సినిమా నుండి తప్పుకున్నారు. ఆయన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. “నేను ధనుష్ ‘సార్’ మూవీలో భాగం కాలేకపోవడం దురదృష్టకరం. ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, వెంకీ అట్లూరితో త్వరలో పని చేయాలని ఆశిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆయన సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయమైతే క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ప్రశ్న.
