చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్.
Read Also : వెబ్ సిరీస్ తో నవ్వించబోతున్న రకుల్!
ధనుష్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ మిత్రన్ జవహర్. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ హీరో స్వంతంగా సమకూరుస్తుండటం విశేషం. అంతే కాదు, సన్ పిక్చర్స్ లాంటి అగ్ర సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనిరుధ్ బాణీలు మరోసారి ధనుష్ ఫ్యాన్స్ ని అలరించనున్నాయి. నటీనటుల విషయానికి వస్తే, భారతీరాజా, ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్లు తెర మీద కనిపించబోతున్నారు. ముగ్గురు హీరోయిన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తారట. నిత్యా మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ గ్లామర్ టచ్ తీసుకురానున్నారు. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, ధనుష్ 44వ సినిమా పేరు ఏంటో తెలుసా? ‘తిరుచిత్రాంబలం’! ‘తిరుచిత్రాంబలం’ టైటిల్ ని బట్టి చూస్తే సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు కోలీవుడ్ లో! చూడాలి మరి, విభిన్న కథలకు పెద్ద పీట వేసే ధనుష్ ఎలాంటి సర్ ప్రైజ్ తో బాక్సాఫీస్ వద్దకొస్తాడో…
