NTV Telugu Site icon

Dhanush: ‘సార్’ ట్రైలర్ వచ్చేస్తోంది…

Sir Trailer

Sir Trailer

మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో ధనుష్ తెలుగు మార్కెట్ లో తన బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని చూస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది.విజయవాడలో 90’ల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పక్కా కమర్షియల్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా ఆడియో జరుపుకున్న వాతి సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ధనుష్ అక్కడ సాలిడ్ హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ధనుష్ లాస్ట్ మూవీ ‘నానే వరువెన్’ సినిమా భారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు.

వాతి మూవీతో ఆ హిట్ లోటు తీర్చేస్తాడని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ ఇప్పటికే ఉన్న పాజిటివ్ బజ్ ని మరింత పెంచుతున్న మేకర్స్, ఈసారి ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచడానికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 8న వాతి.సార్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ బయటకి వస్తే వాతి సినిమాపై ఇప్పటికే అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ. సో కోలీవుడ్ ధనుష్ మంచి ఓపెనింగ్స్ ని రాబడతాడు, తెలుగులో కూడా అదే రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టాలి అంటే ధనుష్ ‘సార్’ సినిమాని హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చెయ్యాలి. మరి ధనుష్ కోలీవుడ్ దాటి హైదరాబాద్ లో అడుగు పెట్టి సార్ సినిమాని ప్రమోట్ చేస్తాడో లేదో చూడాలి.