Site icon NTV Telugu

Vaathi: ‘సార్’ వంద కోట్లు కొట్టాడు…

Vaathi

Vaathi

గతేడాది తిరుచ్చిత్రాంబలం సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేశాడు ధనుష్. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న ధనుష్ కెరీర్ లో మొదటిసారి తెలుగులో నటించిన సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ మూవీ ఫెబ్ 17న ఆడియన్స్ ముందుకి వచ్చింది. సోషల్ కాజ్ ఉన్న సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు ఇచ్చింది. విజయ్, కార్తి, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకి తెలుగులో ఎప్పటినుంచో మార్కెట్ ఉంది కానీ ధనుష్ మొదటి సినిమాతోనే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ ఇవ్వలేకపోయారు. నటుడిగా ధనుష్ గొప్పదనం తెలుగు ఆడియన్స్ కి ఎప్పటినుంచో తెలిసినా తెలుగు సినిమాలో చూడడం ఇదే మొదటిసారి. మొదటి సినిమాకే సొంతగా డైలాగ్స్ చెప్పుకోని, పాట పాడి, ప్రమోషన్స్ కి వచ్చి ధనుష్ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ధనుష్ ఇకపై తన ప్రతి సినిమాని బైలింగ్వల్ చెయ్యగలిగితే తెలుగులో సాలిడ్ మార్కట్ ని సొంతం చేసుకోవచ్చు.

ఇప్పటివరకూ సార్ సినిమా తెలుగు తమిళ భాషల్లో కలిపి వంద కోట్లని రాబట్టింది. ఇందులో ఎక్కువ శాతం కలెక్షన్స్ తెలుగు నుంచే వచ్చినవి కావడం విశేషం. తమకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ స్కూల్ పిల్లలకి స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. “The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids. Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation!” అంటూ నాగ వంశీ ట్వీట్ చేశాడు. మార్చ్ 30 వరకూ తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు కాబట్టి సార్ మూవీ కలెక్షన్స్ కౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.  

Read Also: Raghava Lawrence: ప్రముఖ నిర్మాత చేతికి ‘రుద్రుడు’ హక్కులు…

Exit mobile version