Site icon NTV Telugu

Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”

Ilyaraja

Ilyaraja

Dhanush ILAYARAJA: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా “రాయాన్” అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ధనుష్ కెరీర్ లో 50వ సినిమా గ తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.75.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ధనుష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా గ రాయాన్ నిలిచింది. ఇక ఈ వారం గడిచేసరికి ఈ చిత్రం రూ.100 కోట్లను దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఈ చిత్రానికి కథతో పాటు దర్శకత్వం కూడా ధనుషే చేశారు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ధనుష్ తెరకెక్కించారు. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ఇది ఇలా ఉంటే ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు.

Also Read: Deadpool & Wolverine: దుమ్ము దులిపేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు అన్నసంగతి తెలిసిందే. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. యంగ్ వయసులో ఇళయరాజా ఎలా ఉండేవారో అలా ధనుష్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చేతిలో గిటార్ వాయిస్తూ ఉన్న పోస్టర్ కావడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.

Exit mobile version