Deadpool & Wolverine: దుమ్ము దులిపేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వరిన్
- దుమ్ము దులిపేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వరిన్
- మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3670 కోట్ల వసూళ్లు
- భారత్‌లో 100కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Break Even Collections Deadpool & Wolverine: హాలీవుడ్ నుంచి ఏమైనా సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఆ సినిమా ఎలా ఆయిన సరే చూడాలి అనుకుంటారు. మరి ముఖ్యంగా మర్వెల్ నుంచి వస్తుంది అంటే అది వేరే లెవెల్ హైప్ ఉంటుంది.ఇక ఇప్పుడు ఇదే స్టూడియోస్ నుంచి డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’ జులై 26న విడుదలైంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3670 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో కూడా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1675 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Sangharsana: ఆగస్టు రేసులో మరో చిన్న సినిమా
Also Read
రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ మూవీ బాక్స్ ఫీస్ ని షేక్ చేస్తుంది. దాదాపుగా మూడు రోజుల్లో 3670 కోట్లు కలెక్ట్ చేసి కాసుల వరద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ కలెక్షన్ల హవా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అదరణ దక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్రదారు రయన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి సంభాషణకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి తెలుగులో విశేషాదరణ లభిస్తుంది. ఇక ఇదే కంటిన్యూ చేస్తే భరత్ లో ఈ వారం గడిచేసరికి 100కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!