తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఇదివరకు హీరోయిన్ గా సాయిపల్లవి వార్తలు చక్కర్లు కొట్టగా.. ఈసారి ధనుష్ రెమ్యునరేషన్ పై పడింది. ఈ మూవీ కోసం ధనుష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోతున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ధనుష్ 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇదివరకు ధనుష్ 15 కోట్ల మేర పారితోషకం తీసుకుంటుండగా.. శేఖర్ కమ్ముల సినిమాతో డబుల్ అయిందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళంతో పాటుగా హిందీలోను రానున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
ధనుష్ కు భారీ రెమ్యునరేషన్!
