NTV Telugu Site icon

Dhanush: సూపర్ స్టార్ కి మాజీ అల్లుడి స్పెషల్ విషెస్…

Dhanush

Dhanush

సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు స్పెషల్ విషెష్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఫ్యాన్ మేడ్ పోస్టులు, రజినీ స్టైల్ కి సంబందించిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ని హీరోల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ అందరిలో ధనుష్ ముందుంటాడు. రజినీకాంత్ మాజీ అల్లుడైన ధనుష్ కి రజినీ అంటే ప్రాణం. అల్లుడిగా ఉన్నప్పుడు కూడా రజినీకాంత్, రజినీ సర్, రజినీ మామ అనకుండా తలైవా అనే పిలిచే వాడు ధనుష్.

Read Also: Rajinikanth: ఇలాంటి సూపర్ స్టార్ ని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్…

ఈరోజుకీ రజినీకాంత్ నుంచి సినిమా వస్తుంది అంటే ధనుష్ ఫస్ట్ డే బెనిఫిట్ షోకి వెళ్లిపోతాడు. సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు. ఏ స్టేజ్ పైన అయినా సరే రజినీకాంత్ నాకు దేవుడితో సమానం, అయ్యన్ని చూస్తూనే హీరో అయ్యాను అని చెప్తాడు ధనుష్. అందుకే ఐశ్వర్య నుంచి విడిపోయినా కూడా రజినీకాంత్ ఫ్యాన్స్ ధనుష్ కి వ్యతిరేఖంగా ఇప్పటివరకూ మాట్లాడలేదు. ధనుష్ కి రజినీకాంత్ కి మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఈరోజు ధనుష్ నుంచి హ్యాపీ బర్త్ డే తలైవా అనే ట్వీట్ రాగానే రజినీకాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధనుష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.