Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆరు మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం ధనుష్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో.. కొత్తగా ఉంది ఆ లుక్. ఎప్పటినుంచో ఈ జుట్టు, గడ్డం కోసం కష్టపడుతున్నాడు. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే లుక్ తో సందడి చేశాడు. అయితే అప్పుడు కొద్దిగానే జుట్టు రావడంతో ధనుష్.. సూపర్ కూల్ గా కనిపించాడు. కానీ, ఇప్పుడు మాత్రం జుట్టు పొడువు పెరగడంతో మరింత రగ్గడ్ గా కనిపిస్తున్నాడు.
Shraddha Das: ఈ పాపను కొద్దిగా వాడండయ్యా..
తాజాగా ధనుష్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశాడు. బ్లాక్ ప్యాంట్.. వంగపువ్వు కలర్ హుడీ పై బ్లాక్ గాగుల్స్.. పొడవాటి జుట్టు.. గుబురు గడ్డంతో ధనుష్ సరికొత్త లుక్ లో సందడి చేశాడు. అయితే ఈ లుక్ లో సడెన్ గా ఎవరైనా చూస్తే .. రామ్ దేవ్ బాబా అనుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ ఫోటోల కింద అభిమానులందరూ… యో.. ఇదేం లుక్ అయ్యా.. సడెన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకుంటిమే అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నిజంగా ధనుష్ అచ్చు రామ్ దేవ్ బాబాను గుర్తుచేస్తున్నాడు అని చెప్పొచ్చు. కెప్టెన్ మిల్లర్ కోసమే ఇదంతా అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాలో ధనుష్ ఏ రేంజ్ లో కనిపిస్తాడో చూడాలి.
