NTV Telugu Site icon

OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్

Nene Vastunna Ott Date

Nene Vastunna Ott Date

OTT Updates: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్‌లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ఈ మూవీలో హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను ధనుష్ పోషించడం విశేషం.

Read Also: Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్

అయితే ఇప్పుడు ధనుష్ ‘నేనే వస్తున్నా’ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ మేరకు అక్టోబర్ 27 నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. తమిళంలో నానే వరువీన్‌గా వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ధనుష్-సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన సైకో థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. కాగా ఈ మూవీలో ప్రభు, యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్‌, ఎల్లి అవ్రామ్‌ కీలక పాత్రలు పోషించారు.

Show comments