NTV Telugu Site icon

Captain Miller: పూజతో మొదలైన ధనుష్ కొత్త సినిమా!

Captain Miller

Captain Miller

Captain Miller: నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ భారీ పిరియాడికల్ మూవీ 1930-40 నేపథ్యంలో అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో థనుష్‌ సరసన నాయికలుగా ప్రియాంక మోహన్, నివేదిత సతీశ్ ను ఎంపిక చేసినట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. అలానే సందీప్ కిషన్ సైతం ఇందులో ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో

ధనుష్‌కు ఇది స్పెషల్ ఇయర్!

తమిళ స్టార్ హీరో ధనుష్ కెరీర్‌ లో ఇది స్పెషల్ ఇయర్ గా మిగిలిపోనుంది. గత కొంతకాలంగా ధనుష్‌ యేడాదికి రెండు లేదా మూడు సినిమాలలో చేస్తున్నాడు. దానికి అదనంగా ఒకటో రెండో సినిమాలలో అతిథి పాత్రలు పోషిస్తున్నాడు. కానీ ఈ యేడాది ధనుష్‌ నటించిన అత్యధిక చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ‘మారన్’, ‘ది గ్రే మ్యాన్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇందులో ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ మూవీ. ఇందులో ధనుష్ కనిపించేది కాసేపే అయినా అది కీలక పాత్ర కావడం విశేషం. అలానే దీనికి సీక్వెల్ గా రాబోతున్న మూవీలోనూ ధనుష్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అలానే ఈ యేడాది ధనుష్ నటించిన ‘తిరుచిత్రాంబలమ్’ విడుదలైంది. ఇక ధనుష్ అన్న సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ‘నానే వరువేన్’ ఈ నెల 29న రాబోతోంది. ఈ యేడాది చివరిలో అంటే డిసెంబర్ 2న ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘సర్’ తెలుగు, తమిళ భాషల్లో జనం ముందుకు వస్తోంది. అంటే ధనుష్‌ నటించిన ఐదు సినిమాలు ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయని అనుకోవాలి.