విజయ్ “బీస్ట్”లో ధనుష్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలూ “బీస్ట్”లో భాగం కాబోతున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ కాదు. ఎందుకంటే ధనుష్ ఈ సినిమాలో మరో హీరోగా, లేదా అతిథి పాత్రలోనో కన్పించడం లేదు.
Read Also : గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్
Also Read
ధనుష్ “బీస్ట్” కోసం మరోసారి తన గొంతు సవరించుకుంటున్నాడు అనేది తాజా సమాచారం. “బీస్ట్”లో ధనుష్ ఓ సాంగ్ పాడబోతున్నాడట. విజయ్ వాయిస్ కు సరిపోయేలా తన గొంతులో మాడ్యులేషన్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడట ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో సాంగ్ పాడడం అనేది అభిమానులు సంతోషించాల్సిన విషయం. ఇక ధనుష్ కు సినిమాల్లో పాటలు పాడడం అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో “వై దిస్ కొలవెరి” అంటూ శ్రోతలను తన గాత్రంతో ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. సెల్వ రాఘవన్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, వీటివి గణేష్, అపర్ణ దాస్, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్, సతీష్ కృష్ణన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. “బీస్ట్”కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస నిర్వహించారు. ఈ చిత్రాన్ని 2022 పొంగల్‌కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!