గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్

సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తోంది. ఈ బేబీ ఇటీవల సోషల్ మీడియాలో తన సైక్లింగ్, కయాకింగ్ ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. కేవలం అభిమానులే కాదు, వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె ఆశ్రిత, రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ కూడా ఈ ఫోటోలపై స్పందించడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె కయాకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నదిలో ఆమె తెడ్డు వేసి సంతోషంగా కనిపిస్తోంది.

Read Also : గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్

సమంత ఈ చిన్న విరామం తీసుకునే ముందు తన నెక్స్ట్ తమిళ మూవీ “కాతువాకుల రెండు కాదల్” సినిమా చెన్నై షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ రొమాంటిక్, యాక్షన్ డ్రామాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పౌరాణిక డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విశ్వామిత్రుడు, అప్సర మేనక కుమార్తె శకుంతల, దుష్యంత రాజుల కథ ఆధారంగా ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇందులో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ఈ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-