బాలీవుడ్‌లో ప్రజంట్ బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది. రావడం రావడం మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే గోల్టెన్ ఛాన్స్ కొల్లగొట్టిన ఈ అమ్మడు.. సూపర్ స్టార్ తో పాటు చైతూ ఖాతాలో ప్లాప్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడంతో ఐరన్ లేడీగా ఐడెంటిటీ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ కలిసి రావట్లేదని మెల్లిగా బాలీవుడ్ దారి పట్టింది.
Also Read:Rishi: టాలీవుడ్ బాక్సాఫీస్ పై ఫోకస్ చేస్తున్న కన్నడ హీరో
అప్పటి నుండి టాలీవుడ్ హీరోలకు ప్లాప్స్ ఇచ్చిన కృతి సనన్ తిరిగి సౌత్ సినిమాల వైపు కానీ, సౌత్ హీరోల జోలికి కానీ పోలేదు భామ. కానీ 2023 టాలీవుడ్ ప్రేక్షకులకు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు పీడ కల గా మార్చిన సినిమాలో భాగమైంది కృతి. ఓం రౌత్ తెరకెక్కించిన మైథాలజీ మూవీ ఆదిపురుష్ లో జానకిగా కనిపించింది. కానీ ఈ సినిమా డార్లింగ్ ఖాతాలో బిగ్ డిజాస్టర్ గా మారింది. కాని బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా హిట్ కొట్టడంతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంటే సౌత్ హీరోలతో మాత్రమో కృతి హిట్ అందుకోలేకపోయింది. కానీ తాజాగా టాలీవుడ్ హీరోలకు ప్లాప్స్ ఇచ్చిన కృతి సనన్ తో జోడీ కడుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘తేరీ ఇష్క్ మే’ మూవీలో ఈ ఇద్దరు ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘రంజానా’ లో నటించాడు ధనుష్. ఈ మూవీ భారీ విజయం సాధించింది. తిరిగి ఇప్పుడు ‘తేరీ ఇష్క్ మే’ మూవీతో 12 ఏళ్ల తర్వాత మరోసారి కొలబరేట్ అవుతున్నాడు ధనుష్, ఆనంద్ . రీసెంట్ గా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. భావోద్వేగంతో కూడిన లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది. మరీ తెలుగు హీరోలకు డిజాస్టర్లను ఇచ్చిన కృతి సనన్.. కోలీవుడ్ హీరో ధనుష్ కు హిట్టు ఇస్తుందేమో చూడాలి.