Thandel: సాయిపల్లవి ని ప్రశంసలతో ముంచెత్తిన హీరో కార్తీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుండటంతో ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రెంజ్ లో జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ తమిళ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యంగ్ హీరో కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న హీరో చై, డైరెక్టర్ చందూ అంతా కూడా సాయిపల్లవి డెడికేషన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. వీరితో పాటు కార్తీ కూడా సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తడు..
Also Read:Chhaava: ‘ఛావా’ సినిమాతో వారి అనుభూతిని పంచుకున్న విక్కీ కౌశల్, రష్మిక..
Also Read
కార్తీ మాట్లాడుతూ.. ‘ ‘ప్రేమమ్’ సినిమాలోని మలార్ నుండి ‘అమరన్’ లోని ఇందు వరకు .. నువ్వు చేసిన ప్రతి పాత్ర సో స్పెషల్ సాయి పల్లవి. అన్ని పాత్రలకి నువ్వు జీవం పోశావ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అంత వేరియేషన్ ఎలా చూపించగలుగుతున్నావో అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ‘అమరన్’ లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు ఎంత అల్లాడిపోయిందో, ఆమె ఆవేదన,బాధ ఎవ్వరికీ తెలీదు. కానీ నీ సహజమైన నటన వల్ల అది అందరికీ అర్థమైంది. స్క్రీన్ పై అలాంటి పెర్ఫార్మన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు..హ్యాట్సాఫ్’ అంటూ సాయి పల్లవి ని పొగడ్తలతో ముంచేశాడు కార్తీ. దీంతో కార్తీ మాటలు విన్న సాయిపల్లవి కొంత ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!