Site icon NTV Telugu

Kubera : కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..

Kubera

Kubera

Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల క్రితం పెళ్లయింది కానీ మూవీలో బిచ్చగాడి పాత్రను చేశాడు. ఆ మూవీని దివంగత ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో అల్లరి నరేశ్ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి పాత్రలో నటిస్తాడు.

Read Also : Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అందులో తన భార్య (కమలీని ముఖర్జీ)ని ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెల్లి జరిపిస్తాడు. కోట్లకు వారసుడు అయినా అల్లరి నరేశ్.. అయిన వారి చేతిలో మోసపోయి చివరకు చెత్తకుప్పల వద్ద బిచ్చగాడిగా జీవిస్తాడు. అందులో బిచ్చగాడిగా అతను జీవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ధనుష్ నటించిన పాత్ర అచ్చం అల్లరి నరేశ్ పాత్రకు సరిపోయే విధంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఈ క్రమంలో ఇద్దరి పాత్రలను పోల్చుతూ.. ఎవరు బాగా చేశారంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇద్దరి యాక్టింగ్ అదుర్స్. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు. ఇప్పుడు ధనుష్ పాత్ర నేటి తరం హీరోల్లో చాలా మంది అస్సలు ఒప్పుకోరు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంత పెద్ద స్టార్ డమ్ ఉండి కూడా ఆయన ఇలాంటి పాత్ర చేయడం అంటే నిజంగా ఆయన్ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.

Read Also : Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్

Exit mobile version