Site icon NTV Telugu

Dhanush 50: ఓ.. సార్.. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి

Dhanush

Dhanush

Dhanush 50: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాములు జోరు పెంచలేదు.. ఒకదాని తరువాత ఒకటి సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు.. ఇంకోపక్క గట్టి లైనప్ తో మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు. గతేడాదిలోనే ధనుష్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు. ఇక ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే సార్ రిలీజ్ కు సిద్దమవుతోంది. దీని తరువాత శేఖర్ కమ్ములతో ఒక సినిమా.. తమిళ్ లో కెప్టెన్ మిల్లర్.. ఈ మూడు కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక తాజాగా వీటితో పాటు మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ధనుష్ 50 మొదలు అయ్యింది.

ఇక ఈ సినిమాతో ధనుష్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం రాయన్ అనే టైటిల్ ను అనుకంటున్నట్లు తెలుస్తోంది. ఒక గ్యాంగ్ స్టర్ కథగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట ధనుష్. ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య, విష్ణు విశాల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ధనుష్ ఇన్ని సినిమాలు ప్రకటించడంతో ఓ.. సార్.. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలుగులో ధనుష్ నేరుగా చేస్తున్న చిత్రం సార్.. ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version