Site icon NTV Telugu

Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?

Dsp

Dsp

Devi Sri Prasad: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈ మధ్య ఆయన హవా తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు దేవిశ్రీ ఇచ్చిన ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్స్. దేవి కోసమే డైరెక్టర్స్ ఎదురుచూసేవారు. ప్రస్తుతం దేవి ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాకు మంచి మ్యూజిక్ ను అందించాడు. ఇక దేవి మ్యూజిక్ విషయం పక్కనపెడితే.. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ వయస్సు 43. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. దేవి కెరీర్ లో చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ లు నడిపాడని వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి నిజం లేదని తరువాత క్లారిటీ కూడా వచ్చింది. ఇక తాజాగా దేవిశ్రీ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.

Disha Patani: విప్పి చూపించడంలో నీ తరువాతే పాప.. ఎవరైనా

దేవి వయస్సు పెరుగుతుండడంతో ఇంట్లోవారు ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. వారి కుటుంబంలోనే దేవికి వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని ఇంటి సభ్యులు ఓకే చేశారని టాక్ నడుస్తోంది. ఆ అమ్మాయి వయస్సు 26 అని, దేవిశ్రీ అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండడంతో వయస్సుతో సంబంధం లేకుండా అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారని ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 17 ఏళ్లు గ్యాప్ ఉన్న అమ్మాయిని దేవి పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యింది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version