బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప2. వంద రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర రూ. 1900 కోట్ల గ్రాస్ చేరువలో ఉన్నట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప – 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తుండగా, సుకుమార్ రామ్ చరణ్‌తో ఆర్సీ 17 చేయబోతున్నాడు. ఆ తర్వాతే పుష్ప – 3 పై క్లారిటీ రానుంది.
Also Read : Spirit : ‘స్పిరిట్’ లో వరుణ్ తేజ్ విలన్ న్యూస్ ఫేక్.. కానీ గుడ్ న్యూస్?
కానీ పుష్ప సిరీస్ కు సాలిడ్ మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప – 3 ఐటెం భామను అప్పుడే ఫిక్స్ చేసేశాడు. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా అంటూ సమంత, పార్ట్ 2లో కిస్సిక్ అంటూ శ్రీలీల తమ అందాలతో, తమదైన స్టెప్పులతో పాన్ ఇండియా లెవల్లో మోత మోగించారు. తాజగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప – 3లో ఐటెం బ్యూటీగా ఎవరు ఉంటే బాగుంటుంటనే ప్రశ్న ఎదురైంది దేవిశ్రీ ప్రసాద్‌కు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది. ‘పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ లాంటి వారు స్టార్ హీరోయిన్లుగా ఉన్నప్పుడే నా ఐటెమ్ సాంగ్‌ల్లో నటించారు. పుష్ప 3లో ఎవరనేది దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. నేను మాత్రం సాయి పల్లవి డ్యాన్స్‌కు అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్. ఆమెలో శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా..’ అని చెప్పుకొచ్చాడు.